Zebra | కథను నమ్మి సినిమా చేసే యాక్టర్లలో టాప్ ప్లేస్‌లో ఉంటాడు సత్యదేవ్ (Satyadev). హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసే ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. వీటిలో ఒకటి జీబ్రా (Zebra). ఈశ్వర్ కార్తీక్ (Eswar Karthik) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీని అక్టోబర్ 31న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా సినిమా విడుదల వాయిదా పడ్డది. ఈ మూవీ అక్టోబర్ 31న రావడం లేదని.. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలియజేశారు మేకర్స్. ఇంతకీ వాయిదాకు గల కారణాలేంటనేది తెలియాల్సి ఉంది.
యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సత్యదేవ్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. పుష్ప ఫేం ధనంజయ (జాలిరెడ్డి) కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీని ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన జీబ్రా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
హీరోగానే కాకుండా ఇతర కీలక పాత్రల్లో కూడా నటిస్తోన్న సత్యదేవ్ ప్రస్తుతం ఫుల్ బాటిల్, గరుడ చాఫ్టర్ 1 సినిమాల్లో నటిస్తున్నాడు. ఫుల్ బాటిల్ చిత్రీకరణ దశలో ఉండగా.. గరుడ చాఫ్టర్ 1 ప్రొడక్షన్ దశలో ఉంది.
#ZEBRA gets a NEW RELEASE DATE, will be announced soon! 🤞
Infusing much more excitement & loads of thrills into The World of #ZEBRA 🙌🏽
A @RaviBasrur Musical 💥#SatyaDev #Dhananjaya #EashvarKarthic pic.twitter.com/pQOE5Ib2cB
— Abishek (@ItsAbishek04) October 24, 2024
Raja Saab | డ్యుయల్ రోల్లో ప్రభాస్.. రాజాసాబ్ కోసం మారుతి క్రేజీ ప్లానింగ్
Sonam Kapoor | నీరవ్ మోదీ స్టోర్‌ను భారీ మొత్తానికి కొన్న సోనమ్ కపూర్