Rashmika Mandanna | బాలీవుడ్లో మోస్ట్ క్రేజీయెస్ట్ హార్రర్ యూనివర్స్ స్త్రీ. ఈ ప్రాంఛైజీలో ఇటీవలే స్త్రీ 2 కూడా రాగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఇప్పుడిదే యూనివర్స్‌లో కొనసాగింపుగా వస్తున్న ప్రాజెక్ట్ Thama. పాపులర్ ప్రొడ్యూసర్ దినేశ్ విజన్ మరోసారి తెరకెక్కించబోతున్న ఈ ప్రాజెక్టులో కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్త్రీ, భేడియా, ముంజ్యా లాంటి సినిమాలు అందించిన మేకర్స్ ఈ సారి మాత్రం కొంచెం రూటు మార్చి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ సారి బ్లడీ లవ్ స్టోరీ అంటూ అనౌన్స్మెంట్ వీడియో ద్వారా తెలియజేశారు.
మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పొట్దర్ దర్శకత్వం వహించబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రాన్ని 2025 దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించేశారు. మొత్తానికి దీపావళి బొనాంజా ప్రకటించడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక అభిమానులు.
𝐌𝐀𝐃𝐃𝐎𝐂𝐊 𝐅𝐈𝐋𝐌𝐒 𝐁𝐎𝐎𝐊𝐒 𝐃𝐈𝐖𝐀𝐋𝐈 2025 𝐅𝐎𝐑 𝐓𝐇𝐄𝐈𝐑 𝐍𝐄𝐗𝐓 𝐅𝐑𝐎𝐌 𝐒𝐓𝐑𝐄𝐄 𝐅𝐑𝐀𝐍𝐂𝐇𝐈𝐒𝐄 !!
Expanding his blockbuster horror universe, #DineshVijan is back with #Thama, a bloody love story! Starring #AyushmannKhurrana, #RashmikaMandanna,… pic.twitter.com/1wcFeO0PBZ
— Sumit Kadel (@SumitkadeI) October 30, 2024
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా..?
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..