Singham Again | రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ సినిమాలకు ఏ రేంజ్లో క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఈ స్టార్ డైరెక్టర్ నుంచి సింగం ప్రాంచైజీలో వస్తున్న సినిమా సింగం అగెయిన్ (Singham Again). అజయ్ దేవ్గన్ (Ajay devgn) టైటిల్ రోల్లో నటిస్తుండగా.. రన్వీర్ సింగ్, దీపికాపదుకొనే, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీ నవంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్తోపాటు అజయ్ దేవ్గన్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి వ్యాప్తంగా 197 థియేటర్లలో విడుదలవుతూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని బీటౌన్ సర్కిల్ టాక్. ఈ దేశాల్లో భారీ ఎత్తున విడుదలవుతున్న హిందీ సినిమాగా సింగం అగెయిన్ వార్తల్లో నిలుస్తూ.. సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది.
ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్, రోహిత్ శెట్టి పిక్చర్స్, దేవ్గన్ ఫిలిమ్స్ సంయుక్తంగా తెరెక్కిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన సింగం అగెయిన్ ట్రైలర్ అభిమానులు నిరాశపరిచినట్టు ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. సింగం అగెయిన్ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం సీబీఎఫ్సీ 7 నిమిషాల 12 సెకన్ల పుటేజీని సెన్సార్ చేసింది.
సింగం అగెయిన్ ట్రైలర్..
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..