Zebra | టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి జీబ్రా (Zebra). ఈశ్వర్ కార్తీక్ (Eswar Karthik) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ముందుగా అక్టోబర్ 31న విడుదల చేయాలని నిర్ణయించగా.. రిలీజ్ వాయిదా పడ్డదని తెలిసిందే. మేకర్స్ ప్రకటించిన ప్రకారం జీబ్రా కొత్త విడుదల తేదీ తెలియజేశారు. జీబ్రా చిత్రాన్ని నవంబర్ 22న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్ విడుదల చేశారు.
సత్యదేవ్, ధనంజయ డిఫరెంట్ మూడ్‌లో ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే లాంచ్ చేసిన జీబ్రా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పుష్ప ఫేం ధనంజయ (జాలిరెడ్డి) కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సత్యదేవ్ ప్రస్తుతం ఫుల్ బాటిల్, గరుడ చాఫ్టర్ 1 సినిమాల్లో నటిస్తున్నాడు. ఫుల్ బాటిల్ చిత్రీకరణ దశలో ఉండగా.. గరుడ చాఫ్టర్ 1 ప్రొడక్షన్ దశలో ఉంది.
An exciting, edgy, and gripping experience is on its way! 🔥❤🔥#ZEBRA Worldwide Grand Release On 22nd November 💥
In Cinemas #ZEBRAOnNov22nd pic.twitter.com/wT7LJU6kBU
— BA Raju’s Team (@baraju_SuperHit) October 29, 2024
ANR National Award 2024 | ఏఎన్నార్ జాతీయ పురస్కారం అందుకున్న చిరంజీవి