Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ డ్రామా హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu). హాలీవుడ్ లెజెండరీ స్టంట్ డైరెక్టర్ నిక్ పవెల్ పర్యవేక్షణలో యుద్ద వీరుడు హరిహరవీరమల్లు ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. తాజాగా 150 రోజుల్లో అంటూ హరిహరవీరమల్లు కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఉన్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. అన్‌స్టాపబుల్ ఫోర్స్.. బద్దలు కొట్టలేని స్పిరిట్.. నేడు సాయంత్రం ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ కోసం వేచి ఉండండి.. అంటూ విడుదల చేసిన ఈ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
హరిహర వీరమల్లులో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
150 days to go! #HariHaraVeeraMallu 🤩🤩
UNSTOPPABLE FORCE, UNBREAKABLE SPIRIT
Stay tuned for the first single announcement poster from @HHVMFilm this evening 💥 pic.twitter.com/zgy53gWmvh
— Hari Hara Veera Mallu 🦅 (@HHVMBookings) October 29, 2024
ANR National Award 2024 | ఏఎన్నార్ జాతీయ పురస్కారం అందుకున్న చిరంజీవి