Students | చదువుతోనే ఏదైనా సాధ్యం.. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి : డాక్టర్ అమిరిశెట్టి భాస్కర్
Students | తన స్వగ్రామం తొగుట మండలం పల్లెపహాడ్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం సాగించడం జరిగిందని, డాక్టర్ కావాలని కష్టపడి ప్రొఫెసర్ స్థాయికి ఎదగడం జరిగిందన్నారు లోహిత్ సాయి ఆసుపత్రి అధినేత డాక్టర్ ఆమిరిశెట్టి భాస్కర్.
Students | తొగుట, మార్చి 04: గ్రామీణ విద్యార్థులకు పట్టుదల ఎక్కువగా ఉంటుందని, వారు తలుచుకుంటే ఎలాంటి లక్ష్యమైనా చేరుకుంటారని లోహిత్ సాయి ఆసుపత్రి అధినేత డాక్టర్ ఆమిరిశెట్టి భాస్కర్ పేర్కొన్నారు. తొగుట మండలంలోని వెంకట్రావుపేటలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు డెస్క్‌లు లేకపోవడంతో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి అభ్యర్ధన మేరకు 9వ తరగతికి 20 డెస్క్ లు అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామం తొగుట మండలం పల్లెపహాడ్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం సాగించడం జరిగిందని, డాక్టర్ కావాలని కష్టపడి ప్రొఫెసర్ స్థాయికి ఎదగడం జరిగిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పేదరికాన్ని చాలెంజ్‌గా స్వీకరించి ముందుకు సాగాలన్నారు. చదువుతోనే ఏదైనా సాధ్యమని, చదువు ద్వారానే తాను ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు. ప్రణాళికాబద్ధంగా అభ్యాసం చేస్తే ఏదైనా సాధ్యమేనని ఆయన విద్యార్ధులకు సూచించారు. వెంకట్రరావుపేట పాఠశాలలో మౌళిక వసతుల కల్పన కోసం తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా డెస్క్ లు అందించిన డాక్టర్ అమిరిశెట్టి భాస్కర్‌ను గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామిగౌడ్, హెచ్ఎం నయీమా కౌసర్లు ఘనంగా సన్మానించారు.
ఎంఈఓ నర్సయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం డాక్టర్ భాస్కర్‌ను స్పూర్తిగా తీసుకొని మిగతా వారు ముందుకు రావాలని కోరారు. w కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, ప్రముఖ కవి బండకాడి అంజయ్యగౌడ్, కార్యదర్శి రవీందర్, ఉప సర్పంచ్ లచ్చోళ్ల లింగం, వార్డు సభ్యులు వడ్డె లలిత నర్సింహులు, జహంగీర్, పిట్ల వెంకటేష్, ఎంగలి నరేందర్, మిద్దె శ్రీనివాస్, కత్తుల రాణి రమేష్, వడ్డె శ్యామల నర్సింహులు, గ్రామ పెద్దలు డబ్బికారి పెంటోజి, పులిగారి శివయ్య, సుతారి రాములు, ఈదగల్ల పర్శరాములు, బెజ్జనమైన శ్రీనివాస్, కనకరాజు, రాంబాబు, కల్లెపు నరేష్, కర్ణాకర్, పులిగారి లక్ష్మణ్, నవీన్, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.


Read Also :
Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. చైనా సాయం కోరిన ఎన్ఐఏ కోర్టు
Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

