విద్యుత్‌శాఖలో మాయాజాలం.. అవసరం లేకున్నా స్తంభాలు, వైర్లకు ఎస్టిమేషన్
బిజినేపల్లి మండలంలోని విద్యుత్‌శాఖ క్షేత్రస్థాయిలో విద్యుత్ వినియోగదారులకు వైర్లు, స్తంభాలు, ఇతర సామగ్రి అవసరం లేకున్నా కేవలం సింగిల్ ఫేజ్ మీటర్‌కు వేలల్లో కట్టించి రూ.లక్షల్లో ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వ సొమ్మును అడ్డగోలుగా అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మకై దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- బిజినేపల్లి మండల అధికారులు, కాంట్రాక్టర్ట్ కుమ్మకై భారీ కుంభకోణం
- క్షేత్రస్థాయిలో కనిపించని పనులు, చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
బిజినేపల్లి, జూలై 28 : బిజినేపల్లి మండలంలోని విద్యుత్‌శాఖ క్షేత్రస్థాయిలో విద్యుత్ వినియోగదారులకు వైర్లు, స్తంభాలు, ఇతర సామగ్రి అవసరం లేకున్నా కేవలం సింగిల్ ఫేజ్ మీటర్‌కు వేలల్లో కట్టించి రూ.లక్షల్లో ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వ సొమ్మును అడ్డగోలుగా అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మకై దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోనే 35 గ్రామ పంచాయతీలు, 40కి పైగా తండాలు ఉన్న బిజినేపల్లి మండలంలో విద్యుత్‌శాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. విద్యుత్ వినియోగదారుల కొత్త కనెక్షన్లు మంజూరు కోసం అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. ప్రధానంగా ఇళ్లు, రైతుల విద్యుత్ కనెక్షన్ల కోసం సా మగ్రి అవసరం లేకున్నా ఎంతోకొంత డీడీలు కట్టించి సుమారు రూ.2లక్షల నుంచి 4 లక్షల వరకు ఎస్టిమేషన్ వేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో మీటర్లు, వైర్లు, స్తంభాలు పాతకుం డా పనిపూర్తయినట్లు చూపించడంపై మండల ప్రజలు అవాక్కవుతున్నారు.
కొన్ని దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్లో ఎస్టిమేషన్లో పని పూర్తయినట్లు, వర్క్ ఆర్డర్, మీటర్ రిలీజ్ అయినట్లు వంటి వివరాలు చూపిస్తున్నప్పటికీ సంబంధిత ప్రాంతాల్లో మాత్రం ఏఒక్క పని కూడా చేపట్టనట్లుగా కనిపిస్తోంది. కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే ఇదివరకే ఉన్న లైన్ నుంచి కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ సామగ్రి అవసరం ఉన్నట్లు ఎస్టిమేషన్ పెంచి రికార్డులో చూపించినట్లు బయటపడింది. ప్రధానంగా సామగ్రి, వర్క్ ఆర్డర్స్, మెటీరియల్ బుక్‌లు మెజర్మెంట్ బుక్కులు, మెటీరియల్ ఇచ్చినట్లుగా రికార్డులు, ఫొటో ఆధారాలు, జీపీఎస్ లొకేషన్ వివరాలను పరిశీలిస్తే అసలు వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని మండల ప్రజ లు, వినియోగరులు పేర్కొంటున్నారు. వాస్తవానికి విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఎస్టిమేషన్ సిద్ధం చేసి జరిగిన పనులకు అనుగుణంగా చెల్లింపులు జరగాల్సి ఉంటుంది.
కానీ రికార్డులకు, క్షేత్రస్థాయిలో పనులకు బిల్లులు చెల్లింపులు భిన్నంగా ఉన్నాయి. ఈ వ్యవహారమంతా అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మకై ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా మండలంలోని ఖానాపూర్, పాలెం, మంగనూర్, బిజినేపల్లి గ్రామాల్లో కేవలం ఇండ్లకోసం సింగిల్‌ఫేజ్ మోటర్లకు డీడీలు చెల్లించి లక్షల్లో ఎస్టిమేషన్ వేసి దాదాపు రూ.50 లక్షల వరకు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగానికి పాల్పడినట్లుగా కళ్లకు కట్టినట్లుగా వినిపిస్తోంది. ప్రభుత్వ ధానాన్ని దుర్వినియోగం చేసిన వారిలో లైన్మెన్ స్థాయి నుం చి విద్యుత్‌శాఖ ఏఈ, కాంట్రాక్టర్‌కు తెలిసే జరిగిందన్న విషయం తేటతెల్లమవుతోంది. ఉన్నతాధికారులు స్పం దించి విద్యుత్‌శాఖకు సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే అవినీతి బయపడే అవకాశం ఉన్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు. ఈ విషయమై సంబంధిత ఏఈ శ్రీనివాసులును వివరణ కోరగా తప్పుడు ఎస్టిమేషన్లకు సంబంధించి తన దష్టికి రాలేదని చెప్పారు. ఏ కారణాల చేత అయినా పనులు కాకపోతే పెం డింగ్ పనులు చేయిస్తామని వివరించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

