Baa Baa Black Sheep | యానిమల్ ఫేం మరాఠి యాక్టర్ ఉపేంద్ర లిమాయే బా బా బ్లాక్‌షీప్ (Baa Baa Black Sheep) అంటూ తన టీంతో ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాడని తెలిసిందే. గుణి మంచికంటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ క్రైం కామెడీ జోనర్లో వస్తోంది. ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్లో జాన్ షెల్లీ హిట్లర్ అనే డాన్ పాత్రలో ఉపేంద్ర లిమాయే క్యారెక్టర్‌తోపాటు మిగిలిన యాక్టర్లతో సాగే జర్నీ వినోదాన్ని పంచేలా ఉండబోతుందని హింట్ ఇచ్చేస్తుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఉపేంద్ర లిమాయేను సూపర్‌గా ఎలివేట్ చేసిన అనిల్ రావిపూడి బా బా బ్లాక్‌షీప్ టీంకు సపోర్ట్‌గా నిలిచాడు. ఈ మూవీ నుంచి వేవేల ఊహలే చూపిన సాంగ్‌ను అనిల్ రావిపూడి లాంచ్ చేశాడు. ఉపేంద్ర లిమాయే టీంపై వచ్చే ఈ పాట డిఫరెంట్ స్టైల్లో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ చిత్రంలో టిను ఆనంద్, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ, విస్మయ శ్రీ, మాళవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు.. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట, ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఆరుగురు వ్యక్తుల ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులు, ఈ క్రమంలో వచ్చే కామెడీ, క్రైం లాంటి అంశాలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించనున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ మూవీని దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోణెపూడి నిర్మిస్తున్నారు.
బా బా బ్లాక్‌షీప్ టీజర్ చూస్తే.. అక్షయ్ ఈవెంట్లో చెఫ్ లుక్‌లో కనిపించగా.. ఆ తర్వాత విష్ణు ఎంట్రీ ఇస్తాడు. ఈవెనింగ్ సర్ప్రైజ్ మామ అని విష్ణుతో చెప్తాడు అక్షయ్. పోలీసులు మన వెంట ఎందుకొస్తున్నారురా.. వాళ్లను కూడా ఇన్వైట్ చేశావా..అని టెన్షన్ పడుతుంటే.. ఉపేంద్ర లిమాయే ఎంట్రీ ఇస్తాడు.ఎంటర్టైనింగ్గా ఉండబోతున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. మీరు దొబ్బేసిన బాక్స్ అండ్ గన్ ఎక్కడ…. నా దగ్గర కొట్టేసిన బాక్స్ ఎవరికి అమ్మేశారని అడిగే డైలాగ్స్ తో సాగే టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. చెప్పుకోవడానికి ఇది మామూలు కథ కాదు. అండపిండ బ్రహ్మాండాలనే అల్లాడించే కథ అంటూ విడుదల చేసిన టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Team #BaaBaaBlackSheep gets a big boost with the Hit Machine’s best wishes🔥
Blockbuster director @AnilRavipudi garu launches the blasting number #Vevela 🎶💥
Grand Release in Cinemas on October 9th, 2026 🔥@ChitralayamOffl @VenuDonepudi… pic.twitter.com/tfwxC8LwS1
— Chitralayam Studios (@ChitralayamOffl) September 16, 2026