KTR | ఇది మనిషి సృష్టించిన విషాదం.. ఇరాన్లో 165 మంది బాలికల మృతిపై కేటీఆర్ కామెంట్
KTR | ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్, అమెరికా బలగాలు వైమానికి దాడులతో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పైన, తన పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ప్రతిదాడులు చేస్తోంది. ఫలితంగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
KTR : ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్, అమెరికా బలగాలు వైమానికి దాడులతో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పైన, తన పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ప్రతిదాడులు చేస్తోంది. ఫలితంగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఈ నేపథ్యంలో ఈ మారణహోమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఓ బాలికల పాఠశాల నేలమట్టమవగా.. ఆ శిథిలాల కింద చిక్కుకుని 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వారి అంత్యక్రియలు విషాదకరంగా జరిగాయి.
ఈ నేపథ్యంలో.. ‘పాఠశాలపై ఇజ్రాయెల్, అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 165 మంది బాలికల అంత్యక్రియలకు సంబంధించిన భయంకరమైన, మనసును కలచివేసే దృశ్యాలు..’ అని పేర్కొంటూ కేటీఆర్ ఆ మరణించిన బాలికల సామూహిక సమాధుల దృశ్యాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
యుద్ధం ఆవశ్యకత గురించి చెబుతున్న ఉద్దేశాలు ఏవైనా ఇది మనిషి సృష్టించిన విషాదమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ యుద్ధం రాబోయే తరాలకు బాధను, విషాదాన్ని మాత్రమే మిగిల్చుతుందని తన ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు.
Horrific and haunting Images of a funeral site of 165 young girls killed in Israeli/US bombing that hit a school in Iran
No matter what the stated purpose is, this is a man made tragedy which leaves nothing behind but suffering and misery for ages to come #StopTheWar pic.twitter.com/qofhbZlXxs
— KTR (@KTRBRS) March 4, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

