Vijay Devarakonda – Rashmika Mandanna | టాలీవుడ్ మోస్ట్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం (మార్చి 4) సాయంత్రం వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరగనున్న నేపథ్యంలో, ఈ కొత్త జంట తాజాగా తెలుగు మీడియా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తనదైన శైలిలో మాట్లాడుతూ.. ‘తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది.. తనను అందరూ మంచిగా చూసుకోవాలి’ అంటూ నవ్వులు పూయించాడు. తమ సినీ ప్రయాణంలో మీడియా ఒక అంతర్భాగమని, ఇప్పుడు జంటగా ప్రేక్షకుల ముందుకు రావడం ఒక విభిన్నమైన మరియు గొప్ప అనుభూతిని ఇస్తోందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కాలం మారుతున్నా, తాము ఎదుగుతున్నా తమను ఆదరించిన వారిని ఎప్పటికీ మర్చిపోమని, అందరి ఆశీస్సులు తమపై ఉండాలని విజయ్ కోరారు. రష్మిక సైతం తామిద్దరం కలిసి జీవితంలో ఒక మధురమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని సంతోషం వ్యక్తం చేశారు. ఇక నేడు జరగనున్న రిసెప్షన్‌కు సినీ గ్లామర్‌తో పాటు రాజకీయ, ఇతర రంగాల దిగ్గజాలు భారీగా తరలిరానున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా వేడుక ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా, ఎక్కడా చిన్నపాటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.