Taapsee Pannu | నిర్మొహమాటంగా మాట్లాడి వార్తల్లో నిలుస్తుంటుంది అందాలభామ తాప్సీ పన్ను. రీసెంట్గా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వాఖ్యలు బీటౌన్‌లో చర్చనీయాంశమయ్యాయి. ‘డంకీ, జూడ్వా2 చిత్రాలకు పెద్దమొత్తంలో పారితోషికాలు అందుకున్నానని ఈ మధ్య కొందరు నాపై కథనాలు రాసేశారు. వారికి తెలీని విషయం ఏంటంటే, కథానాయికలు అడిగినంత పారితోషికాలు ఇచ్చేలా పరిశ్రమ లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ని ఒక్కొక్కరూ ఒక్కోలా చూస్తారు.
పెద్ద హీరోలున్న సినిమాల్లో హీరోయిన్లకు విలువే ఉండదు. కొందరు హీరోలు ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్లను ఎంచుకుంటారు. మరికొందరు తమని డామినేట్ చేయని వాళ్లను హీరోయిన్లుగా తీసుకుంటారు. ఆ విధంగా హీరోయిన్లను హీరోలు డిసైడ్ చేస్తున్న రోజులువి. కొందరు నిర్మాతలైతే మాతో సినిమాలు చేస్తూ మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడతారు. ఇలాంటి వారందరితో పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నాం. అందుకే పిచ్చిరాతలు రాయకండి.’ అంటూ హెచ్చరించింది తాప్సీ పన్ను.