Nikhil Siddhartha | టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) నటిస్తున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo). స్వామిరారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో సినిమా గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు నిఖిల్ .
ఈ చిత్రం ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతుందని నిఖిల్ ధీమా వ్యక్తం చేశాడు. స్వామి రారా చిత్రంలో మిస్సయిన లవ్ స్టోరీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో చూస్తారు. బెస్ట్ స్క్రీన్ ప్లేతో సాగే కథనం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరని.. సినిమాలో ప్రతీ పది నిమిషాలకొక సర్ప్రైజ్ ట్విస్ట్ ఉంటుందని చెప్పి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు నిఖిల్.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ రేసర్‌గా కనిపించబోతున్నట్టు టీజర్‌తో అర్థమవుతోంది. హైదరాబాద్‌లోని ఓ బస్తిలో ఉండే నిఖిల్ లండన్‌కు వెళ్లి.. అక్కడమ్మాయిని ప్రేమలో పడేసి లైఫ్‌లో సెటిల్ అయిపోదామనుకునే క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలు ఏంటనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది.
Thandel | డైలామాకు చెక్.. ఆ టైంలోనే నాగచైతన్య తండేల్ రిలీజ్..!