Devara | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్‌రోల్ పోషించిన చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కాగా సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారి కోసం ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది.
ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 8న దేవర నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇంకేంటి మరి థియేటర్లలో మిస్సయిన వారు డిజిటల్ ప్లాట్‌ఫాంలో చూసి ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించారు.
ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్..
Nikhil Siddhartha | ప్రతీ పది నిమిషాలకో ట్విస్ట్.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాపై నిఖిల్
Thandel | డైలామాకు చెక్.. ఆ టైంలోనే నాగచైతన్య తండేల్ రిలీజ్..!