టీ- 20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్.. జోరుగా బెట్టింగ్
టీ20 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌పై ఆదివారం బెట్టింగ్‌లు జోరుగా నడిచాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇండియా గెలుస్తోందని ఉదయం నుంచి బెట్టింగ్ కొనసాగింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌పై భారత్ గెలుస్తోందని చాలా మంది బెట్టింగ్ కాచారు. న్యూజిలాండ్‌పై తక్కువగానే బెట్టింగ్ నడిచాయి. ఇందులో బుకీలు ఆన్‌లైన్‌తో పాటు నేరుగా కూడా బెట్టింగ్ నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్‌పై గతంలో బెట్టింగ్ నిర్వహించిన ముఠాలు రంగంలోకి దిగాయి.
- ఆఫ్‌లైన్, ఆన్లైన్లలో యువత బిజీ బిజీ
సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): టీ20 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌పై ఆదివారం బెట్టింగ్‌లు జోరుగా నడిచాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇండియా గెలుస్తోందని ఉదయం నుంచి బెట్టింగ్ కొనసాగింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌పై భారత్ గెలుస్తోందని చాలా మంది బెట్టింగ్ కాచారు. న్యూజిలాండ్‌పై తక్కువగానే బెట్టింగ్ నడిచాయి. ఇందులో బుకీలు ఆన్‌లైన్‌తో పాటు నేరుగా కూడా బెట్టింగ్ నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్‌పై గతంలో బెట్టింగ్ నిర్వహించిన ముఠాలు రంగంలోకి దిగాయి. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఆదివారం సాయంత్రం కాలనీలు, బస్తీల్లో ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేసుకొని మ్యాచ్‌లు వీక్షించారు. అయితే క్రికెట్ బెట్టింగ్ విషయంపై పోలీసులు దృష్టి పెట్టలేదనే విమర్శలు వచ్చాయి. ఇటీవల టీ 20 కిక్రెట్ మ్యాచ్‌లు జరిగిన సందర్భంలో చాలా మంది బెట్టింగ్ నిర్వహించారు. అయితే ఫైనల్‌కు ఇండియా చేరుకోవడంతో ఈ బెట్టింగ్ మరింత జోరుగా సాగింది.
న్యూజిలాండ్ టాస్ గెలవడం, ఇండియాకు బ్యాటింగ్ ఇవ్వడంతో ఎంత స్కోర్ కొడుతారు, ఎవరు ఫామ్‌లో ఉన్నారు, ఎన్ని సిక్స్‌లు, ఫోర్లు కొడుతారనే విషయంపై కూడా బెట్టింగ్‌లు జరిగాయి. ఇండియా టీమ్‌లో ఫామ్‌లో ఉన్న సంజు సామ్సన్, బూమ్రలపై ప్రత్యేకంగా బెట్టింగ్ నిర్వహించారు. ఇండియా గెలుస్తుందని రూ.100 పెట్టుబడి పెడితే రూ.140, న్యూజిలాండ్ గెలుస్తుందని రూ.100 పెట్టుబడి పెడితే రూ. 180 ఇలా ఆయా జట్టు బలబలాలతో బెట్టింగ్ కొనసాగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. బాల్ బాల్‌కు, రన్ రన్‌కు కూడా ఈ బెట్టింగ్‌లు కొనసాగాయి.
ఆన్లైన్ యాప్‌లో జోరు..!
ఆన్లైన్లో క్రికెట్ కోసం ప్రత్యేకంగా బెట్టింగ్‌యాప్‌లు ఉండడంతో చాలామంది ఈ యాప్‌లపై దృష్టి పెట్టారు. బుకీల వద్ద పెట్టుబడి పెడితే ఇబ్బందికరంగా ఉంటుందనే బావనతో చాలామంది ఆన్లైన్లోనే క్రికెట్ బెట్టింగ్ వైపు మొగ్గు చూపారు. వివిధ బెట్టింగ్ యాప్‌లు అందులో ఉండడంతో ఆయా యాప్‌లు యూపీఐ పేమెంట్స్‌ను కూడా అనుమతి స్తుండడంతో యువత ఎక్కువగా ఆన్లైన్ బెట్టింగ్‌లు నిర్వహించినట్లు సమాచారం. ఆన్లైన్ బెట్టింగ్‌లో విదేశీ బెట్టింగ్ వెబ్సైట్లు, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపు లు ఆన్లైన్ బెట్టింగ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
కొందరు ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించేందుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను కూడా తెరిచినట్లు సమాచారం. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ బెట్టింగ్ బాగానే జరిగింది. పాన్‌షాపులు, చిన్న చిన్న దుకాణాలు ..ఇలా బుకీలు తమ నెట్‌వర్క్‌ను నిర్వహించారు. క్రికెట్ మ్యాచ్ మొత్తానికి ఒక రకంగా, మొదటి ఐదు ఓవర్లకు ఇంకోరకంగా చార్జి చేస్తూ వెళ్లారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, తదితర నగరాల్లో ఈ బెట్టింగ్ మాఫియా తమ బెట్టింగ్ దందాను నిర్వహించాయి. సుమారు 2 వేల కోట్లకుపైగానే బెట్టింగ్ జరిగి ఉ ంటుందనే చర్చ జరుగుతుంది.
బెట్టింగ్ అనేది వ్యవస్థీకృతంగా నడవడం ఒక ఎత్తైతే, యువత తమ ఇన్నర్, ఔటర్ సర్కిళ్లలోనూ ఈ బెట్టింగ్ దందా నిర్వహించారు. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు, యువత ఇలా అందరూ తమ స్నేహితులు, బంధువులతో కలిసి తక్కువ మొత్తాల్లో బెట్టింగ్ నిర్వ హించారు. శివార్లలో ఫామ్ హౌస్‌లు తీసుకొని క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించిన వారు చాలామంది ఉన్నారు. అలాంటివారు తమ స్నేహితులతో కలిసి క్రికెట్ బెట్టింగ్దందాను నిర్వహించినట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

