Fee Reimbursement | ఫీజు బకాయిలు ఇక లేనట్టే.. గతం గురించి వదిలేయాలన్న సీఎం
Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వనట్టేనని తేలిపోయింది. ఈ విద్యా సంవతర్సం నుంచి మాత్రమే నిధులు చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా ప్రకటించారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పారు.
Fee Reimbursement | హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వనట్టేనని తేలిపోయింది. ఈ విద్యా సంవతర్సం నుంచి మాత్రమే నిధులు చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా ప్రకటించారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పారు. నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటుచేసిన జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలను సీఎం శుక్రవారం ఆవిషరించి మాట్లాడారు. ఫీజులు కట్టలేదని యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపేందుకు వీల్లేదని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు అడుగకుండానే ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ముందుగానే వారి ఖాతాల్లో వేస్తామని, అందుకోసం ఏటా రూ.2,400 కోట్లు చెల్లించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలుచేస్తామని తెలిపారు. విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా, సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని, అప్పుడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కంప్యూటర్ సైన్స్ చదివినా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని, ఏఐతో ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఐటీ ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం తలెత్తిందని, ఆ సంక్షోభాన్ని ఎలా ఎదురోవాలో ఆలోచించాల్సిన అవసరముందని వివరించారు. ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు కేవలం జయంతి, వర్ధంతులను నిర్వహించేందుకు కాదని, వారి త్యాగాలు, ఔన్నత్యం, స్ఫూర్తికి వేదికలుగా నిలుస్తాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

