మియాపూర్, సెప్టెంబర్ 19: అసెంబ్లీ ఎదుటే ఇటీవల పోలీసులు బీఆర్ఎస్ మహి ళా ఎమ్మెల్యేల చీరలు లాగడం, గొంతులు ప ట్టుకోవడం, జట్టుపట్టి లాగిన ఘటనలు మరువకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకున్నది. చుట్టుపక్కల వారు ప్రశ్నిస్తున్నా రైల్వే స్టేషన్లో కూర్చున్న మహిళను హోమ్‌గార్డు జుట్టుపట్టి ఈడ్చుకెళ్లడం తీవ్ర దుమారం రేపింది. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వా రందరినీ బయటకు పంపించే క్రమంలో విధు ల్లో ఉన్న ఆర్పీఎఫ్ హోమ్‌గార్డు కడిగ ఆనంద్ స్టేషన్లో కూర్చున్న ఓ మహిళను బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లాడు.
బాధితురాలు బాధతో రోదిస్తున్నా కనికరం చూపలేదు. ఆ మహిళ తనపై నోరుపారేసుకోవడంతో ఆగ్రహంతో ఇలా చేసినట్టు హో మ్గార్డు పేర్కొన్నాడు. అక్కడున్నవారు ఇ దంతా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారి డీజీపీ దృష్టికి వెళ్లింది. దీంతో డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. వెంటనే హోమ్‌గార్డును సర్వీస్ నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని సైబరాబాద్ సీపీని ఆదేశించారు. పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబరాబాద్ సీపీ హో మ్గార్డుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సిందిగా మియాపూర్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు ఆనంద్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.