Crop Bonus | విత్తన కొనుగోళ్లు రిజిస్ట్రేషన్ చేయిస్తేనే సన్నాలకు బోనస్.. అది కూడా ఏడు రకాలకే!
Crop Bonus | కాంగ్రెస్ సర్కార్ సన్నాల బోనస్ ఎగవేతకు మరో మెలిక పెట్టింది. రైతులు సన్న రకం ధాన్యం పండిస్తేనే సరిపోదట.. ఆ రైతులు సన్న రకం విత్తనాలను కొనుగోలు చేసినట్టుగా రుజువు చూపించాలని షరతు పెట్టింది.
Crop Bonus | హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ సన్నాల బోనస్ ఎగవేతకు మరో మెలిక పెట్టింది. రైతులు సన్న రకం ధాన్యం పండిస్తేనే సరిపోదట.. ఆ రైతులు సన్న రకం విత్తనాలను కొనుగోలు చేసినట్టుగా రుజువు చూపించాలని షరతు పెట్టింది. సన్న రకాల విత్తనాలు కొనుగోలు చేసినట్టు డీలర్ల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకొంటేనే సన్నాలకు బోనస్ చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకొన్నది. శుక్రవారం సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
వానకాలం పంటకు సంబంధించి ఈ ఏడాది నుంచి ఏడు రకాల సన్నాలకే రూ.500 బోనస్ చెల్లించాలని మంత్రివర్గం తీర్మానించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. యాసంగిలో 81.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, కేంద్ర ప్రభుత్వం 63.62 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల ట న్నుల ధాన్యాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు క్యా బినెట్ ఆమోదం తెలిపింది. మిగులు ధాన్యానికి కూడా క్వింటాల్‌కు రూ.2,389 బేసిక్ ధర నిర్ణయించి.. ఈ-వేలం ద్వారా ధాన్యం అమ్మాలని నిర్ణయించింది. స్వా తంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు 1.06 కోట్ల స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2.0 సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది.
యంగ్ ఇండియా వర్సిటీలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు
రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీల ను ‘యంగ్ ఇండియా సిల్స్ యూనివర్సిటీ’ పరిధిలోకి తీసుకొనిరావడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర స్తుతం ఈ కళాశాలలు సాంకేతిక విద్యాశాఖ పరిధిలో ఉ న్నాయి. వీటిని తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి తొలగించి వర్సిటీ పరిధిలో చేర్చనున్నారు. ఆదిలాబాద్, నిర్మ ల్, ముథోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పెట్రోల్, డీజిల్ ఆటోలు ఈవీలుగా కన్వర్షన్
హైదరాబాద్‌లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలున్నాయి. వీటిని ఈవీ(విద్యుత్తు వాహనాలు గా) మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం(తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ సీమ్) అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ పరిధిలోని కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించాలని నిర్ణయించింది. అక్టోబర్ 31 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-2 పనుల కోసం రూ.2,100 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం తెలిపింది. గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ట్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీలకు పెంచడంతోపాటు సోలార్ విద్యుత్తు ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

