హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సామాన్యుడి జేబు గుల్ల చేసే రీసైక్లింగ్ దోపిడీ రాజకీయం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెర ముందు సంక్షేమ జపం చేస్తూనే.. తెర వెనుక మద్యం ధరల మోతకు పక్కా స్కెచ్ వేసింది. పంద్రాగస్టు నాడు కొత్త రేషన్ కార్డులు, రెండు లక్షల మందికి చేయూ త పింఛన్లు అంటూ పాలకులు చేస్తున్న ప్ర చార ఆర్భాటమంతా కేవలం ప్రజల కండ్ల కు గంతలు కట్టే జిమ్మిక్కులేననేది బహిరం గ రహస్యం. మద్యం విషయానికొస్తే బ్రాండ్‌ను బట్టి క్వార్టర్ సీసాపై రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.75వరకు బాదేందుకు సిద్ధమవుతున్నది. ఈ ధరల మోతతో ప్రజల్లో నుంచి వచ్చే వ్యతిరేకతను కప్పిపుచ్చుకొనేందుకే ప్రభుత్వం అనూహ్యంగా స్మార్ట్ రేషన్ కార్డు అస్ర్తాన్ని తెరపైకి తెచ్చిందని తెలుస్తున్నది. లిక్కర్ రేట్ల పెంపుతో సామాన్యుడి రక్తాన్ని పన్నుల రూపంలో పీల్చి పిప్పి చేసేందుకు సాగుతున్న ఈ ఆదాయపు వేట ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది.
రాష్ట్రంలో 16లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిం ది. ప్రస్తుతం తెల్లరేషన్ కార్డు మీద చౌక ధరల దుకాణం నుంచి ప్రతి వ్యక్తికీ నెలకు 5కిలోల బియ్యం, పట్ణణాల్లో కిలో గోధుమలు ఇస్తున్నారు. ఈ లెక్కన కొత్త కార్డుల తో రాష్ట్ర ప్రభుత్వానికి గరిష్ఠంగా రూ.100 కోట్ల అదనపు భారం పడుతున్నది. వృ ద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తామని ప్రకటించారు కానీ అది ఇప్పట్లో కాదని తెలుస్తున్న ది. ఒకవేళ 2.25లక్షల మందికి కొత్తగా పిం ఛన్లు ఇచ్చినా నెలకు రూ.45 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా.
అందుకే మద్యం ధరలను 10 నుంచి 15% పెంచాలని, ప్రతిరోజూ రూ.50 కోట్ల మేర ప్రజల నుంచి అదనంగా పిండుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ‘ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ’ నివేదిక సిద్ధం చేయగా ధరల సవరణ అమలైతే ప్రీమియం బ్రాండ్లపై గరిష్ఠంగా రూ.75 వరకు అదనపు భారం పడనున్నది. రోజువారీ కూలీలు, సామాన్య వర్గాలను ఆకర్షించేందుకు 150 ఎంఎల్, 200 ఎంఎల్ వంటి చిన్న సైజు బాటిళ్లను మారెట్లోకి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నది.
బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే ఈ వ్యూహాత్మక మర్మం బట్టబయలవుతున్నది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పరిధిలోని చేయూత పింఛన్ల కోసం 14,861 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ ఇదే బడ్జెట్లో ఒక ఎక్సైజ్ శాఖ నుంచే ఖజానాకు రావాలని నిర్దేశించుకున్న రాబడి అంచనా మాత్రం ఏకంగా 19,605.11 కోట్లుగా పేర్కొన్నది. అం టే.. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సంక్షేమ రూపంలో పంచే మొత్తం నిధుల కంటే, మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆమ్దానీ రూ.4,744 కోట్లు అధికం.
పేదలకిచ్చే సం క్షేమానికి అయ్యే ప్రతి పైసానూ, అంతకుమించి అదనపు సొమ్మునూ అదే పేద కుటుంబాల బలహీనతలపై మద్యం పన్నుల రూపంలో వసూలు చేయడమేనా ప్రభుత్వ ఆర్థిక నమూనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల రేషన్ కార్డులకు ఆధునీకరిస్తా మని ప్రకటించింది. ఇందులో దాదాపు 70 లక్షల కార్డులు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినవే కావటం గమనా ర్హం. సంక్షేమ పథకాల విస్తరణకు మద్యం ఆదాయమే కొలమానమైతే.. అది ప్రజలను ఆదుకోవడం కాదు, వారి వ్యసనాలపై ఆధారపడి ఖజానాకు వ్యాపారం చేసుకోవడమే అనే విమర్శలు వెల్తువెత్తుతున్నాయి.