Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా దళపతి 69 (Thalapathy 69). హెచ్ వినోథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీడియోల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవలే దళపతి 69 కొత్త షెడ్యూల్ షురూ అవగా.. విజయ్‌తోపాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్నట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. కాగా ఇప్పుడొక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతూ.. విజయ్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రం ఓవర్సీస్ థ్రియాట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయన్న వార్త ఒకటి హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం రూ.78 కోట్లు పలికాయి.
ఈ ధర ది గోల్, లియో చిత్రాల కంటే ఎక్కువ కావడం విశేషం. విజయ్ సినిమాకు క్రేజ్ ఎలా రేంజ్లో ఉందో ఈ ఒక్క వార్త చెప్పకనే చెబుతోంది. దళపతి-హెచ్ వినోథ్ కాంబో బాక్సాఫీస్‌ను రూల్ చేయడం పక్కా అని అర్థమవుతోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2025 దీపావళి కానుకంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో దళపతి 69 చివరి సినిమా కానుందని తెలిసిందే. మరి విజయ్ లాస్ట్ సినిమా ఎలాంటి జోనర్లో ఉండబోతుందో అంటూ.. ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Just a single announcement has been made so far#Thalapathy69 overseas theatrical rights sold for record price of ₹78 Cr beating GOAT 🐐 & Leo 🦁
Thalapathy Vijay – H.Vinoth combo 🥵🔥🔥🔥 pic.twitter.com/bvrvq0hYR7
— Taurus (@itz_chillax) November 4, 2024
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Nikhil Siddhartha | ప్రతీ పది నిమిషాలకో ట్విస్ట్.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాపై నిఖిల్
Thandel | డైలామాకు చెక్.. ఆ టైంలోనే నాగచైతన్య తండేల్ రిలీజ్..!