Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇటీవలే వెట్టైయాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక అభిమానులు, మూవీ లవర్స్ ఫోకస్ అంతా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో నటిస్తోన్న కూలీ (Coolie) పైనే ఉంది.
తలైవా అభిమానుల కోసం స్టన్నింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. కూలీ చిత్రాన్ని 2025 వేసవి కానుకగా విడుదల చేయబోతున్నారు. అంతేకాదు మరోవైపు కార్తీతో లోకేశ్ కనగరాజ్ చేయబోతున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఖైదీ 2 వచ్చే ఏడాది ఆగస్టు నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఒకేసారి రెండు వార్తలు రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మూవీ లవర్స్.
కూలీ టైటిల్ టీజర్లో బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్ ఛైన్లతో సూపర్ స్టార్ తలైవా చేస్తున్న స్టైలిష్ ఫైట్ సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కూలీలో సత్యరాజ్, అక్కినేని నాగార్జున, మహేంద్రన్, మంజుమ్మెల్ బాయ్స్ యాక్టర్ సౌబిన్ షాహిర్ (Soubin Shahir) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తు్న్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కూలీలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెప్పకనే చెబుతున్నాయి.
LokeshKanagaraj:
– #Coolie will release in Summer 2025🌟
– #Kaithi2 work will kickstart in Aug 2025🔪 pic.twitter.com/ePvbRtXJYu— AmuthaBharathi (@CinemaWithAB) November 5, 2024
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Nikhil Siddhartha | ప్రతీ పది నిమిషాలకో ట్విస్ట్.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాపై నిఖిల్
Thandel | డైలామాకు చెక్.. ఆ టైంలోనే నాగచైతన్య తండేల్ రిలీజ్..!