Lalkota | లాల్కోట గ్రామంలో పదో తరగతి విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ..!
మహబూబ్‌నగర్, మార్చి 10 : చిన్నచింతకుంట మండలంలోని లాల్కోట(Lalkota) గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ సామగ్రిని సామాజిక సేవకుడు పట్వారి వెంకట్రాములు (Patwari Venkatramulu) పంపిణీ చేశారు.
మహబూబ్‌నగర్, మార్చి 10 : చిన్నచింతకుంట మండలంలోని లాల్కోట(Lalkota) గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ సామగ్రిని సామాజిక సేవకుడు పట్వారి వెంకట్రాములు (Patwari Venkatramulu) పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు.. వంటి ఉపయుక్తమైన స్టేషనరీ వస్తువులను ఆయన అందజేశారు.
విద్యార్ధులకు స్టేషనరీ అందించిన పట్వారి వెంకట్రాములు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవసరమైన సహాయం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు అవసరమైన సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
విద్యార్థులకు స్టేషనరీ సామగ్రి పంపిణీ చేస్తున్న పట్వారి వెంకట్రాములు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాధికారి మురళీ కృష్ణ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్య అనేది ప్రతి విద్యార్థి జీవితాన్ని మారుస్తుందని, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు.

సామాజిక సేవకుడు పట్వారి వెంకట్రాములు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు మనసారా అభినందించారు. పరీక్షల ముందు ఉచితంగా స్టేషనరీ అందుకున్నందుకు పదో విద్యార్థులు సైతం ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

