Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్
Thug Life | లోకనాయకుడు కమల్‌హాసన్ హీరోగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ‘నాయగన్’ (నాయకుడు 1987) తర్వాత దాదాపు 37 ఏండ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Thug Life | లోకనాయకుడు కమల్‌హాసన్ హీరోగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ‘నాయగన్’ (నాయకుడు 1987) తర్వాత దాదాపు 37 ఏండ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కమల్‌హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తుండగా.. త్రిష కథానాయికగా నటిస్తుంది. శింబు, అశోక్ సెల్వన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 05 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి రీలీజ్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే.. కమల్ హాసన్ విశ్వరూపం, విక్రమ్ తర్వాత మళ్లీ అలాంటి పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రాజ్ కమల్ ప్రోడక్షన్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

