Sai Pallavi | కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Siva karthikeyan) నటించిన తాజా ప్రాజెక్ట్ అమరన్ (Amaran). మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో శివకార్తికేయన్ లీడ్ రోల్లో నటించగా.. సాయిపల్లవి (Sai Pallavi) మేజర్ ముకుంద్ సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించింది. అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది.
ఈ చిత్రంలో సాయిపల్లవి నటనపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)ప్రశంసలు కురిపించారు. సినిమా చూశాను తనకు కన్నీళ్లు వచ్చేశాయన్నారు. తండేల్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అమరన్ సినిమా చూశాను. ఆఖరున సాయిపల్లవి వచ్చి ఊపి వదిలేసింది. బయటకు వచ్చేటప్పుడు కండ్లలో నీళ్లున్నాయి.
గుండె బరువుతో బయటకు వచ్చి కారులో ఎమోషనల్‌గా ఉన్నప్పుడే సాయిపల్లవితో మాట్లాడాలని ఫోన్ చేశా. ఆమెతో మాట్లాడిన తర్వాత కానీ నాకు తనివి తీరలేదు. నేను ఆమెనెప్పుడూ ఒక కూతురులా చూసుకుంటూ ఉంటాను. నాకే కూతురుంటే ఇలా ఉంటదేమోననిపిస్తుంటుంది.
అటువంటి అమ్మాయి అలాంటి పర్ ఫార్మెన్స్ చేసి ఈ ఊరొస్తుందంటే మనం చిన్న ప్రశంస ఇవ్వాలి కదా.. అంటూ సాయిపల్లవిని బొకే అందజేసి గౌరవించారు. సాయిపల్లవి గురించి వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
Thandel | నాగచైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ స్టిల్.. థియేటర్లలో తండేల్ సునామి వచ్చే తేదీ ఇదే..!
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Thalapathy 69 | బాక్సాఫీస్‌ను రూల్ చేయబోతున్న విజయ్-హెచ్ వినోథ్.. దళపతి 69 రైట్స్‌కు రికార్డ్ ధర