Prithviraj Sukumaran | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అతి కొద్ది యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు. ఈ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ చివరగా ప్రభాస్ నటించిన సలార్‌లో మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా హిందీ సినిమాకు సంతకం చేశాడన్న వార్త అభిమానులు, ఫాలోవర్లలో జోష్ నింపుతోంది.
మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న Daayra సినిమాలో విక్కీ కౌశల్ లీడ్ రోల్లో నటిస్తున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై పృథ్విరాజ్ సుకుమారన్, కరీనాకపూర్ రొమాంటిక్ అప్పీరియన్స్ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ సినిమాను ముందుగా ఆయుష్మాన్ ఖురానాతో ప్లాన్ చేయగా.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే కాదు.. కథలో మార్పులు చేయాలని సూచించాడట. దీంతో మేఘనా గుల్జార్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్‌ను ఫైనల్ చేసినట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ కాప్‌గా కనిపించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ప్రస్తుతం పృథ్విరాజ్ సుకుమారన్సలార్ సీక్వెల్‌గా వస్తోన్న సలార్ 2లో నటిస్తున్నాడు.
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్