Ram Gopal Varma – US Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ ఆయన ఇచ్చిన నినాదానికి అమెరికన్లు ఓట్ల వర్షం కురిపించారు. దీంతో అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో విజయానికి కావాల్సిన 270 ఓట్లను ట్రంప్ సాధించారు. బుధవారం రాత్రి 11 గంటల సమయానికి ట్రంప్‌నకు 294 ఎలక్టోరల్ ఓట్లు దక్కగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 223 ఓట్లు సాధించారు. మొత్తంగా ట్రంప్ 50.9 శాతం ఓట్లు దక్కించుకోగా, కమలా హారిస్ 47.4 శాతం ఓట్లు సాధించారు. అయితే ట్రంప్ సాధించిన విజయం పట్ల ఒక సెటైరికల్ పోస్ట్ పెట్టాడు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
ట్రంప్ విజయంపై స్పందిస్తూ.. బుల్లెట్ ట్రంప్‌కి తగిలితే కమల చనిపోయింది అంటూ వ్యంగంగా ఎక్స్‌లో రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ నగరంలో ప్రసంగిస్తుండగా అతడిపై ఒక వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు ఈ కాల్పులు జరుపగా.. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
BULLET hit TRUMP and killed KAMALA
— Ram Gopal Varma (@RGVzoomin) November 7, 2024