Pushpa 2 Vs Chaava | తెలుగుతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun)-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
మరోవైపు బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ నటిస్తున్న చిత్రం ఛావా(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 06న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. మహారాష్ట్ర చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్‌గా రాబోతున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
పుష్ప ది రూల్ సినిమాపై ఇప్పటికే సూపర్ బజ్ క్రియేట్ అవడమే కాదు.. విడుదలకు ముందే నిత్యం వార్తల్లో నిలుస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇక పుష్పరాజ్ మేనియాతో విక్కీ కౌశల్ టీం విడుదల విషయంలో వెనక్కి తగ్గినట్టు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మరి నిజంగానే ఛావా అనుకున్న సమయానికి రావడం లేదనేది కేవలం పుకారు మాత్రమేనా..? నిజమా..? అనేది తెలియాల్సి ఉంది.
పుష్ప 2 ది రూల్‌లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీ రోల్ చేస్తుండగా.. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మరోసారి సందడి చేయబోతున్నాడు. సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, అజయ్ ఘోష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్