krish jagarlamudi | టాలీవుడ్లో ఉన్న వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్లలో ఒకరు క్రిష్ జాగర్లమూడి (krish jagarlamudi). కథను నమ్మి సినిమాలు చేసే అతికొద్ది దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు. క్రిష్ చాలా కాలం తర్వాత అనుష్కా శెట్టితో ఘాటి సినిమా తెరకెక్కిస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా క్రిష్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇంట వెడ్డింగ్ (wedding) బెల్స్మోగనున్నాయా అంటే తాజా కథనాలు అవుననే చెబుతున్నాయి. తాజా టాక్ ప్రకారం క్రిష్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లా (Priti Challa)ను నిశ్చితార్థం చేసుకోబోతున్నాడట. ఈ నెలలో పెండ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుండగా.. వెడ్డింగ్ ఈవెంట్ అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరుగనుందని ఇన్సైడ్ టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
క్రిష్‌కు ఇది రెండో పెండ్లి. మొదటి భార్య కూడా డాక్టర్ కాగా క్రిష్ ఆమెకు విడాకులిచ్చిన విషయం తెలిసిందే. గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు క్రిష్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహరవీమల్లుపై వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాకు జ్యోతికృష్ణ కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Pushpa 2 Vs Chaava | పుష్పరాజ్ ఫీవర్.. అల్లు అర్జున్‌తో పోటీపై విక్కీ కౌశల్ వెనక్కి తగ్గాడా..?
Prithviraj Sukumaran | కరీనాకపూర్‌తో పృథ్విరాజ్ సుకుమారన్ రొమాన్స్..!
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్