Kalki 2898 AD | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ జోనర్లో మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీని వైజయంతీ మూవీస్ తెరకెక్కించింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం త్వరలో జపాన్‌లో కూడా సందడి చేయబోఉతంది. తాజా సమాచారం ప్రకారం జనవరి 3 2025న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కల్కి 2898 ఏడీ రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి జపాన్‌లో ఈ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం కల్కి 2898 ఏడీ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో లో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
All time Blockbuster #Kalki2898AD is all set to Release in Japan on January 3rd, 2025! 🇯🇵🔥#Prabhas #プラバース pic.twitter.com/n68DfMwisj
— Prabhas Trends (@TrendsPrabhas) November 11, 2024
Akira Nandan | ప్రిపరేషన్ షురూ.. గ్రాండ్ ఎంట్రీ కోసం అకీరానందన్ ట్రైనింగ్.. !
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?
Devara | ఓటీటీలో దేవర సందడి.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే.. ?