Pushpa 2 The Rule | తెలుగు ప్రజలతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాంచైజీ మూవీలో టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటిస్తుండగా.. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారని తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ పాటలో ముందు శ్రద్ధాకపూర్‌ను అనుకోగా వర్కవుట్ కాకపోవడంతో శ్రీలీలను తీసుకున్నారని తెలిసిందే. తాజాగా శ్రీలీల సాంగ్ షూట్లో జాయిన్ అయిందట.
రిలీజ్ డేట్‌ను దృష్టిలో పెట్టుకుని జెట్ స్పీడులో సాంగ్ చిత్రీకరిస్తున్నారని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఈ పాట కోసం వారం రోజుల తీసుకోబోతున్నారని ఇన్సైడ్ టాక్. గుంటూరు కారం తర్వాత చేస్తున్న రెండో పెద్ద సినిమా కావడం శ్రీలీలకు బాగా కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు.
ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా పనిచేస్తు్ండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Krish | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?
Pushpa 2 Vs Chaava | పుష్పరాజ్ ఫీవర్.. అల్లు అర్జున్‌తో పోటీపై విక్కీ కౌశల్ వెనక్కి తగ్గాడా..?
Prithviraj Sukumaran | కరీనాకపూర్‌తో పృథ్విరాజ్ సుకుమారన్ రొమాన్స్..!
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్