Racing Buggy | నర్సాపూర్, మార్చి1 : నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీఆర్ ఐటీ కళాశాలలో నాలుగు రోజులుగా జరిగిన ఈ బాజా సే ఇండియా 2028 బగ్గీల పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా అడిషనల్ ఎస్పీ సీఎస్ మహేందర్ హాజరై పోటీలకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాజా సే ఇండియా పోటీలలో పాల్గొంటున్న టీమ్స్‌కు అభినందనలు తెలియజేస్తూ.. విద్యార్థులు సంతోషంగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.
అనంతరం విష్ణు ఎడ్యూకేషనల్ సొసైటీ సెక్రటరీ ఆదిత్య బిస్సం, జాయింట్ సెక్రటరీ సాయి సుమంత్ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో ఇటువంటి పోటీలు నిర్వహించడం ప్రప్రథమమని అటువంటి పోటీలు 2024-25-28 వరుసగా మూడు సార్లు నిర్వహించబడిన ఘనత తమ కాలేజికి చెందుతుందని అన్నారు. బహుమతుల ప్రధాన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే మాట్లాడుతూ.. తమ కళాశాలలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం విష్ణు ఎడ్యూకేషనల్ సొసైటీ చైర్మన్ కె.వి. విష్ణురాజు దూరదృష్టికి నిదర్శనమని, ఇంజనీరింగ్ ప్రాధాన్యతను తెలిపేందుకు, ఉద్యోగ అవకాశాలు విద్యారులకు పుష్కలంగా వచ్చేందుకు నిరంతరం పరితపిస్తున్న వారి ఆలోచన రూపమే నేటి ఈ బారీ ఖర్చుతో కూడిన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అనంతరం ఎం బాజా సే ఇండియా కన్వీనర్ అలీ సయ్యద్, జాయింట్ కన్వీనర్ డా. వేముల మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల నుండి 1500 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారని, మొత్తం 51 బగ్గీలు రిజిస్ట్రేషన్ చేసుకోగా చివరిపోటీ సమయానికి 32 బగ్గీలు మాత్రమే అర్హత సాధించాయని తెలిపారు.
విజేతలు వీరే..
ఈ ఉత్కంఠ పోటీల్లో మొదటి బహుమతి డా. విశ్వనాథ్ కరద్ ఎమ్ఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ పూణే సాధించి రూ.1,50,000 గెలుపొందారు. రెండవ బహుమతి కేఎస్ఈ సాంకేతిక విశ్వవిద్యాలయం క్లూటక సాధించి రూ.10 లక్షలు గెలుపొందారు. అలాగే మూడవ బహుమతి డివై పాటిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కొల్హాపూర్ బహుమతి రూ.75 వేలు సాధించారు.
వాహన స్థిరత్వానికి రెండవ బహుమతి ఆంధ్రప్రదేశ్ భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ను దక్కింది. బహుమతి నగదు రూ.20 వేలు అందజేశారు. వాహన తయారీ ఎక్సలెన్స్ అవార్డు క్రింద మొదటి బహుమతి ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ను దక్కింది. బహుమతి రూ.40 వేలు అందజేశారు. వెహికల్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ ఆవార్డు మొదటి బహుమతి ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం శ్రీ విష్ణు ఇంజనీరింగ్ ఫర్ ఉమెను దక్కగా రూ.30 వేలు నగదు అందజేశారు.
బీబీరాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి డా. ముత్తు లాగు బాజా సే ఇండియా 2028 ద్రోణాచార్య అవార్డు గ్రహీతగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంజయదూబే, డైరెక్టర్ డా. లక్ష్మీప్రసాద్, చైర్మన్ బాలాజ్ సుబ్రమణ్యం, ఆర్గనైజింగ్ కమిటీ డా. కె.సి.వోరా అలాగే ఈ పోటీలు సజావుగా సాగేందుకు టీవీఆర్ టీ యాజమాన్యం, మేనేజర్ బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టిఎల్ఎన్ సురేశ్ నిరంతరం కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Supritha | అమ్మ సంతోషమే ముఖ్యం .. సురేఖ వాణి రెండో పెళ్లిపై సుప్రీత భావోద్వేగ వ్యాఖ్యలు
Iran vs US | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. దేశం నుంచి 444 విదేశీ విమానాలు రద్దు
Kara release Announcement | ధనుష్ ‘కారా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలో దిగుతున్న కరసామి!