Kareena Kapoor | సైఫ్ అలీ ఖాన్ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో సర్ప్రైజ్ ఇచ్చిన కరీనా కపూర్
Kareena Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో, ‘దేవర’ విలన్ సైఫ్ అలీ ఖాన్ ఆగస్టు 16న తన 56వ పుట్టినరోజును జరుపుకున్నారు. సోషల్ మీడియాకు సైఫ్ దూరంగా ఉన్నప్పటికీ.. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను భార్య, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. ఈసారి కూడా సైఫ్ బర్త్‌డే సందర్భంగా కరీనా చేసిన ప్రత్యేక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kareena Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో, ‘దేవర’ విలన్ సైఫ్ అలీ ఖాన్ ఆగస్టు 16న తన 56వ పుట్టినరోజును జరుపుకున్నారు. సోషల్ మీడియాకు సైఫ్ దూరంగా ఉన్నప్పటికీ.. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను భార్య, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. ఈసారి కూడా సైఫ్ బర్త్‌డే సందర్భంగా కరీనా చేసిన ప్రత్యేక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కరీనా కపూర్ తమ వెకేషన్‌కు సంబంధించిన పలు అరుదైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సముద్ర ప్రయాణాలు, బీచ్‌లో సరదా క్షణాలు, పిల్లలతో కలిసి గడిపిన సమయం, లాంగ్ డ్రైవ్‌లు, లిఫ్ట్ ఫొటోలతో పాటు సైఫ్, కరీనా జంటగా ఉన్న పిక్స్ కూడా ఈ పోస్టులో ఉన్నాయి.
ముఖ్యంగా స్విమ్‌సూట్‌లో కరీనా, వైట్ షర్ట్‌లో సైఫ్ ఉన్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ జంట కెమెరాకు పోజులిచ్చిన తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.సైఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కరీనా రాసిన క్యాప్షన్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. తన జీవిత భాగస్వామికి బర్త్‌డే విషెస్ చెబుతూ.. “నువ్వు లేకపోతే నా జీవితం ఎంత బోర్‌గా ఉండేదో!” అంటూ ప్రేమగా పేర్కొన్నారు. అంతేకాదు.. తాను షేర్ చేసిన ప్రతి ఫొటోను సైఫ్ స్వయంగా చూసి ఓకే చేసినవేనని సరదాగా వెల్లడించారు. దీంతో కరీనా పోస్ట్ అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలకు బ్యాక్‌గ్రౌండ్‌లో 2008లో వచ్చిన ‘తషాన్’ సినిమాలోని ‘దిల్ డ్యాన్స్ మారే’ పాటను కరీనా జత చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సైఫ్, కరీనా మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లి 2012 అక్టోబర్ 16న ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
అప్పటి నుంచి బాలీవుడ్లో అత్యంత క్రేజీ జంటల్లో ఒకటిగా సైఫ్-కరీనా పేరు సంపాదించుకున్నారు. వీరికి తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. సైఫ్.. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ‘హైవాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా, సైఫ్ సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. మరోవైపు కరీనా కపూర్.. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దాయిరా’ సినిమాలో నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

