WI vs IND : సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్‌లో భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేస్తున్నారు. వెస్టిండీస్ ఓపెనర్లకు దంచేందుకు అవకాశమివ్వడం లేదు. దాంతో.. ఆచితూచి ఆడిన షాయ్ హోప్(25 నాటౌట్), రోస్టన్ ఛేజ్(20 నాటౌట్)లు ఏమాత్రం రిస్క్ తీసుకోలేదు. ఫలితంగా.. పవర్ ప్లేలో విండీస్ వికెట్ కోల్పోకుండా 45 రన్సే చేయగలిగింది.
తొలి ఓవర్లో మూడే రన్స్.. హార్దిక్ పాండ్యా ఓవర్లో సిక్స్, ఫోర్‌తో షాయ్ హోప్(25 నాటౌట్) ఊపు తెచ్చాడు. అనంతరం.. అర్ష్‌దీప్ ఓవర్లో రోస్టన్ ఛేజ్(20 నాటౌట్) రెండు ఫోర్లతో చెలరేగాడు. అయితే.. బుమ్రా ఓవర్లో వికెట్ల వెనకాలబౌండరీ రాబట్టాడు ఛేజ్.. ఆ తర్వాత బంతిని గాల్లోకి లేపగా అభిషేక్ అందుకున్నట్టే అందుకొని నేలపాలు చేశాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బతికిపోయిన ఓపెనర్.. పవర్ ప్లే చివరి ఓవర్లో బౌండరీతో స్కోర్ 40 దాటించాడు.