Suryapeta Corridor | హైదరాబాద్ నుంచి అమరావతికి ఏర్పాటు చేయనున్న బుల్లెట్ రైల్ తొలుత ప్రకటించిన అలైన్మెంట్ ప్రకారమే చేపట్టాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని తెలిసిందే. జాతీయ రహదారి 65కు సమాంతరంగా రైల్వే కారిడార్ సాధించేందుకు కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్ నుంచి అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
కాగా గురువారం సూర్యాపేటకు రైల్వే కారిడార్ కోసం విద్యార్థులు మేము సైతం అంటూ కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చి బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చడం పట్ల అఖిలపక్షాలతోపాటు గురువారం సూర్యాపేట పట్టణంలోని విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
సూర్యాపేటకు రైల్వే కారిడార్ ఏర్పాటు చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వేలాదిమంది విద్యార్థులు పెద్ద ఎత్తున సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి 60 ఫీట్ల రోడ్డు, వాణిజ్య భవన్ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి భారీ నిరసన వ్యక్తం చేశారు.