Sivakarthikeyan | కోలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న అతికొద్ది మంది యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు శివకార్తికేయన్ (Sivakarthikeyan). మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ శివకార్తికేయన్ లీడ్ రోల్లో తెరకెక్కిన నటించిన చిత్రం అమరన్ (Amaran). అమరన్ అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాగా.. మంచి టాక్ తెచ్చుకుంటోంది.
తాజాగా అమరన్ ధాటికి అరుదైన ఫీట్ శివకార్తికేయన్ ఖాతాలో పడిపోనుందన్న వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. అమరన్ నేటితో రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంటరబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ , విజయ్ తర్వాత ఈ అరుదైన ఫీట్ ఖాతాలో వేసుకుంటున్న నాలుగో హీరో శివకార్తికేయన్ కావడం విశేషం.
సూర్య కంగువ బాక్సాఫీస్ పర్ ఫార్మెన్స్ను బట్టి అమరన్ వసూళ్లు రూ.300కోట్ల క్లబ్‌లోకి ఎంటరైన ఆశ్చర్యపోవసరం లేదంటున్నారు సినీ జనాలు. శివకార్తికేయన్ నటించిన డాన్ హయ్యెస్ట్ గ్రాసర్ (రూ.125 కోట్లు) నమోదు చేసింది. కెరీర్లో బెస్ట్ సినిమాలు చేస్తూ రోజురోజుకీ పాపులారిటీ ఏస్థాయిలో పెంచేసుకుంటున్నాడో తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది.
SK21గా తెరకెక్కిన ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటించాడు.
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?
Akira Nandan | ప్రిపరేషన్ షురూ.. గ్రాండ్ ఎంట్రీ కోసం అకీరానందన్ ట్రైనింగ్.. !
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?