Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి రాబోతున్న సినిమా దళపతి 69 (Thalapathy 69). హెచ్ వినోథ్ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీడియోల్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంతకీ శివన్న ఈ చిత్రంలో ఎలాంటి రోల్లో కనిపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమైనప్పటికీ.. ఈ వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ 2025 దీపావళి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో దళపతి 69 చివరి సినిమా కానుండటంతో..ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
దళపతి 69 ఓవర్సీస్ థ్రియాట్రికల్ రైట్స్ రూ.78 కోట్లు పలికాయన్న వార్త ఒకటి ఇప్పటికే అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ ధర ది గోల్, లియో చిత్రాల కంటే ఎక్కువ కావడం విశేషం.
A legendary collaboration on the horizon!#Shivanna confirms his role in #Thalapathy69 alongside, #ThalapathyVijay ‘s final film.#ThalapathyViiay pic.twitter.com/MzHRUybwD8
— KollyWorld (@KollyWorld14) November 12, 2024
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !