krish jagarlamudi | టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (krish jagarlamudi) డైరెక్టర్ ఇంట వెడ్డింగ్ (wedding) బెల్స్ మోగనున్నాయంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లా (Priti Challa)ను త్వరలోనే పెండ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా సైలెంట్‌గా పెండ్లి పీటలెక్కేశాడు క్రిష్.
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లా (Priti Challa)ను వివాహం చేసుకున్నాడు క్రిష్. పెండ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవాళ మనం డాక్టర్ ప్రీతి చల్లా జీవితంలో ఒక అందమైన కొత్త అధ్యాయాన్ని జరుపుకుంటున్నాము. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆమె ప్రయాణంలో అంతులేని ఆనందం, నవ్వుల కలయిక ఉండాలని కోరుకుంటున్నామని ప్రీతి చల్లా టీం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరితో పంచుకుంది.
క్రిష్‌కు ఇది రెండో పెండ్లి. మొదటి భార్య కూడా డాక్టర్ కాగా క్రిష్ ఆమెకు విడాకులిచ్చిన విషయం తెలిసిందే. గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహరవీమల్లుపై వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాకు జ్యోతికృష్ణ కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ మరోవైపు అనుష్కా శెట్టితో ఘాటి సినిమా తెరకెక్కిస్తున్నాడు.
krish jagarlamudi weds Priti Challa
krish jagarlamudi weds Priti Challa