Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి SVC59. రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా (Ravikiran Kola) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది.
ఇప్పటికే లాంఛ్ చేసిన మోషన్ పోస్టర్లో ‘నా చేతుల మీద ఉన్న రక్తం వాళ్ల చావుకు చిహ్నం కాదు.. వ్యక్తిగా నా పునర్జన్మకు సంకేతం’ అని క్యాప్షన్ ఇచ్చారు. నెత్తురుతో నిండిన కత్తి, ఆ కత్తి పట్టిన చెయ్యితో.. ‘కత్తి నాదే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే’ అంటూ రాసిన ట్యాగ్‌లైన్స్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడ మొదలవబోతుందనే దానిపై ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ మూవీ చిత్రీకరణ 2026లో మొదలు కానుందని ఫిలిం నగర్ సర్కి్ల్ సమాచారం. విజయ్ దేవరకొండ మరోవైపు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వీడీ 12 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది.
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?