ఖైరతాబాద్, ఫిబ్రవరి 26 : నిమ్స్‌లో పార్కింగ్ ఫీజుల వసూళ్లను గురువారం నిలిపివేసినట్లు తెలిసింది. ఆస్పత్రిలో పార్కింగ్ ఫీజు దోపిడిపై సికింద్రాబాద్ గాంధీనగర్‌కు చెందిన తిమ్మన నవీన్ రాజు హైకోర్టులో పిటీషన్ (డబ్ల్యూ.పి.నం. 5296 ఆఫ్ 2026) దాఖలు వేశారు. దీంతో ఈ నెల 19న తక్షణమే ఈ వ్యవహారంపై రెండువా రాల్లో విచారణ జరిపి వివరణ ఇవ్వాలని, అంత వరకు పార్కింగ్ ఫీజు వసూలు నిలిపివేయాలంటూ హైకోర్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, ఈవీడీఎం డైరెక్టరేట్, నిమ్స్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.
అయి తే ఈ నోటీసును యాజమాన్యం లైట్ తీసుకోవడంతో పార్కింగ్ కాం ట్రాక్టర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ యథేచ్ఛగా ఫీజుల వసూళ్లను కొనసాగించింది. ఈ నేపథ్యంలో బాధితుడు నెల 25న మరో సారి నిమ్స్ దవాఖానకు వెళ్లి పార్కింగ్ అక్రమ పార్కింగ్ ఫీజుల వసూళ్లపై ఆస్పత్రి ఆవరణలో ఎమ్మార్పీఎస్ నేతలతో కలిసి నిరసన, ధర్నా చేప ట్టారు. ఈ విషయం బయటకు రావడంతో నోటీసులు అందుకున్న అధికారులు హుటా హుటిన నిమ్స్ డైరెక్టర్‌ను పిలిపించుకొని దీనిపై మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పార్కింగ్ ఫీజులు వసూళ్లను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు నిమ్స్‌లో ఉచిత పార్కింగ్ అంటూ ఆస్పత్రికి వచ్చే వాహనదారులకు చెప్పడం విశేషం.
నిమ్స్‌కు వచ్చే పేద, మధ్యతరగతి రోగులు, వారి సహాయకులకు మరో సారి పెయిడ్ పార్కింగ్ భారం మోపే అవకాశాలు ఉన్నట్లు సమా చారం. నిమ్స్‌లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత ఇప్పటి వరకు పార్కింగ్ ద్వారా ఎంత వరకు వసూలు చేశారు…..అవి ఎవరికి ఖాతా లోకి వెళ్లాయి.. అనేదానిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2018 ఫిబ్రవరి 20న ప్రభుత్వం జారీ చేసిన జీవో 63 ప్రకారం ఆస్పత్రుల్లో పెయిడ్ పార్కింగ్ నిషిద్ధమైనా నిమ్స్‌లో మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూ వచ్చింది. కొం దరి లాభం కోసం ఈ జీవోను ఉల్లంఘించారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా పేదల ఆస్పత్రి అ యిన నిమ్స్‌లో మళ్లీ పెయిడ్ పార్కింగ్ కొనసాగించే ఏర్పా ట్లు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.