BCCI | బంగ్లాదేశ్ పర్యటనపై అనిశ్చితి.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ..!
BCCI : భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ను బాయ్‌కాట్ చేసిన బంగ్లాదేశ్(Bangladesh)తో వన్డే సిరీస్‌పై అనిశ్చితి కొనసాగుతోంది. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఆగస్టులోనే టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లాలి.
BCCI : భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ను బాయ్‌కాట్ చేసిన బంగ్లాదేశ్(Bangladesh)తో వన్డే సిరీస్‌పై అనిశ్చితి కొనసాగుతోంది. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఆగస్టులోనే టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లాలి. కానీ, ఇప్పటివరకూ బీసీసీఐ(BCCI) నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇరుదేశాల బోర్డుల మధ్య సఖ్యత లేకపోవడం, భద్రతపరమైన ఆందోళనల నేపథ్యంలో కేంద్రం అనుమతి కోరనుంది బీసీసీఐ.
బంగ్లాదేశ్ పర్యటన విషయంలో భారత బోర్డు సొంతంగా నిర్ణయం తీసుకోలేదని ఇండియా టుడేతో బీసీసీఐ ప్రతినిధులు చెప్పారు. బంగ్లాలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు సిద్దంగా ఉన్నందున కేంద్రం అనుమతి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
𝐁𝐂𝐂𝐈 𝐭𝐨 𝐬𝐞𝐞𝐤 𝐂𝐞𝐧𝐭𝐫𝐞’𝐬 𝐚𝐩𝐩𝐫𝐨𝐯𝐚𝐥 𝐟𝐨𝐫 𝐁𝐚𝐧𝐠𝐥𝐚𝐝𝐞𝐬𝐡 𝐭𝐨𝐮𝐫
The #BCCI is set to approach the government of #India for permission and clarity on the Indian team’s proposed #Bangladesh tour, as cricketing ties between the two countries remain… pic.twitter.com/4dKSL0mWeS
— IndiaToday (@IndiaToday) August 9, 2026
‘బంగ్లాదేశ్ పర్యటన విషయంలో మేము కేంద్రం అనుమతి తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే నిర్ణయం ప్రకటిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మాకు మేముగా ఏ నిర్ణయం తీసుకోలేం. ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌కు టీమిండియాను పంపాలా? వద్దా? అనేదానిపై ఏమీ ఆలోచించలేదు. అయితే.. త్వరలోనే ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. సిరీస్ విషయమై బంగ్లా బోర్డు మాకు లేఖ రాసింది. ఇప్పటికైతే ఇరుదేశాల బోర్డులు నిత్యం టచ్‌లోనే ఉన్నాయి’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
భద్రతకు హామీ..
సంపన్నమైన భారత క్రికెట్ నియంత్రణ మండలితో సంబంధాలు పునరుద్దరణ కోసం బంగ్లాదేశ్ బోర్డు(BCB) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ ఆడేది లేదని బెట్టుచేసి చివరకు వేటుకు గురవ్వడంతో బుద్ది తెచ్చుకున్న బీసీబీ.. ద్వైపాక్షకి సిరీస్‌కు సిద్ధమంటోంది. టీమిండియా వస్తే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని బంగ్లా క్రికెట్ బోర్డు సెక్యూరిటీ కమిటీ చైర్మన్ సయీద్ ఇబ్రహీం అహ్మద్ (Sayeed Ibrahim Ahmed) అన్నాడు. భారత జట్టుతో సిరీస్ జరిపేందుకు తాము ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోబోమని సయీద్ పేర్కొన్నాడు.

షెడ్యూల్ ప్రకారం నిరుడు జూన్‌లో టీమిండియా వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్‌కు వెళ్లాలి. కానీ, అంతర్గత సంక్షోభం కారణంగా పర్యటన వాయిదా పడింది. దాంతో, షెడ్యూల్‌ను ఈ ఏడాది(2026) సెప్టెంబర్‌కు మార్చారు. కానీ, బంగ్లాలో హిందువులపై హింస, దాడులు.. ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తొలగించడం వంటివి ఇరుబోర్డుల మధ్య దూరాన్ని పెంచాయి.
దానికి తోడు.. ఇండియాలో టీ20 ప్రపంచకప్‌ను బాయ్‌కాట్ చేయడం ద్వారా బంగ్లాదేశ్ బోర్డుకు, బీసీసీఐకి మధ్య అంతరం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో.. ఆర్థికంగా నష్టపోయిన తమ బోర్డుకు ఊతమిచ్చేందుకు సెప్టెంబర్‌లో తమదేశానికి టీమిండియా వస్తే బాగుండని బీసీబీ కోరుకుంటోంది. అందుకే.. బీసీబీ భద్రతా కమిటీ ఛైర్మన్ సయీబ్ భద్రత కల్పించేందుకు మేము సిద్ధమని ప్రకటించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

