Rashmika Mandanna | కన్నడ భామ రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాంఛైజీలో టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు.
ఈ బ్యూటీ డబ్బింగ్ స్టూడియోలో ఉన్న స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ను షేర్ చేసుకుంది. శ్రీవల్లి పాత్రకు డబ్బింగ్ చెబుతున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు వినోదం, ఆటలు ముగిశాయి. బిజినెస్ నుంచి దిగిపోవాల్సిన టైం వచ్చేసింది. పుష్ప షూటింగ్ దాదాపు పూర్తయింది. పుష్ప ది రూల్ ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయింది.
ప్రస్తుతం సెకండాఫ్ డబ్బింగ్ కొనసాగుతోంది. సినిమా ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్ప్రీరియన్స్ అందించడం పక్కా. వెయిట్ చేయలేక పోతున్నానంటూ రాసుకొచ్చింది రష్మిక మందన్నా. ఇప్పుడీ స్టిల్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు పుష్ప మూవీ లవర్స్.
ఫస్ట్ పార్టుకు సూపర్ హిట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు ఇప్పటికే విడుదలైన పాటలు చెబుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
You guys are really really in for a Mind Blowing Experience 🔥🔥
National Crush @IamRashmika dubbing for #Pushpa2TheRule and gives solid update about the shoot💥💥😍#RashmikaMandanna #AlluArjun #Sukumar #Pushpa2 pic.twitter.com/dnNmgToTIl
— Suresh PRO (@SureshPRO_) November 13, 2024
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేసిన పోలీసులు