Sandeep Reddy Vanga | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ (Spirit). కాగా సినిమా ఎప్పుడు మొదలవుతుందంటూ తెగ చర్చించుకుంటున్న అభిమానులకు క్లారిటీ ఇచ్చేశాడు టీ సిరీస్ ఎండీ భూషణ్‌కుమార్.
ఈ విషయంపై భూషణ్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ.. స్పిరిట్ సినిమా పూజా కార్యక్రమం డిసెంబర్లో ఉండబోతుంది. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్క్రిప్ట్ రైటింగ్‌తోపాటు మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి పాటలు సిద్దం చేసే పనిలో ఉన్నాడు. స్పిరిట్ పూర్తిగా కాప్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుంది. రెగ్యులర్ షూటింగ్ 2025 జనవరి నుంచి షురూ కానుంది.
త్వరలోనే దీని గురించి ప్రకటిస్తాం. అంతేకాదు కేవలం 6 నెలల గ్యాప్‌లోనే స్పిరిట్ షూట్ పూర్తి చేస్తాం. 2026 ప్రథమార్థంలో విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. భూషణ్ కుమార్ కామెంట్స్ ప్రభాస్ అభిమానులను పుల్ ఖుషీ చేస్తున్నాయి. స్పిరిట్‌లో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ మడాంగ్సియోక్ (MaDongSeok) విలన్‌గా కనిపించబోతుండగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ పాన్ ఆసియన్ మూవీని భారతీయ భాషలతోపాటు చైనీస్, కొరియన్ భాషలో విడుదల చేసేలా ప్లాన్ రెడీ చేసిందట సందీప్ రెడ్డి వంగా టీం. ఇక ప్రభాస్ కెరీర్లో తొలిసారి స్పిరిట్ సినిమా కోసం ఖాకీ డ్రెస్ వేసుకుంటుండటంతో ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు అభిమానులు. ఈ మూవీని సందీప్‌రెడ్డి వంగాతో కలిసి టి సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ స్పిరిట్ నిర్మిస్తున్నారు.
#Prabhas & Vanga film will EXPLODE like anything! Even PRABHAS is SUPER DUPER EXCITED to work on this one 💥🔥#SandeepReddyVanga is writing #Spirit, making songs with the music director, and we shall do a MUHURAT in December ✅
~ #Tseries Producer #BhushanKumar pic.twitter.com/MKCD5sh8Vf
— BFilmy Official (@BFilmyOfficial_) November 12, 2024
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేసిన పోలీసులు
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?