తన కోపమే తన గుండెకు శత్రువు
తరచుగా కోపం తెచ్చుకునేవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మితిమీరిన కోపం, తీవ్రమైన ఆవేశం.. గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందట.
తరచుగా కోపం తెచ్చుకునేవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మితిమీరిన కోపం, తీవ్రమైన ఆవేశం.. గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందట. కోపంలో గట్టిగా అరవడం వల్ల.. ఆ తర్వాతి రెండు గంటల్లో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉంటుందట. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఈ విషయాన్ని బయటపెట్టింది. ఎలాంటి హృదయ సంబంధ సమస్యలు లేకపోయినా.. తరచుగా కోపం వచ్చేవారిని గుండెపోటు ఇట్టే పలకరిస్తుందట.
ఇందుకు గల కారణాలను పరిశోధకులు వివరిస్తున్నారు. కోపంలో ఉన్నప్పుడు శరీరం ‘ఫైట్ ఆర్ ఫ్లయిట్’ మోడ్‌లోకి వెళ్తుంది. దీనివల్ల అకస్మాత్తుగా రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె ధమనులపై ఒత్తిడిని పెంచి, గుండెపోటుకు దారితీస్తుంది. అంతేకాకుండా కోపం వచ్చినప్పుడు శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి.
రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేస్తాయి. ధమనుల్లో ఇప్పటికే కొవ్వు పేరుకుపోయి ఉంటే.. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కోపంతో రగిలిపోయేవారి శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది హృదయ సంబంధిత వ్యాధులకు కారణం అవుతుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే.. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలాముఖ్యం. నిత్యం యోగా చేయడం వల్ల భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది. వ్యాయామం, కొన్నిరకాల బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. గుండెను దృఢంగా మార్చుకోవచ్చు. కోపం వచ్చిన దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేస్తే.. మెదడుతోపాటు గుండె కూడా శాంతిస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- angry
- Health news
- heart attack
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

