బుల్లెట్ రైలు వ్యయం రెట్టింపు
అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ రైలు కారిడార్‌పై 2026 మార్చి నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) రూ.92,761 కోట్లు ఖర్చు చేసింది. డెక్కన్ హెరాల్డ్ ప్రతినిధి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
- రూ.2 లక్షల కోట్లకు పెరిగిన ప్రాజెక్ట్ అంచనా వ్యయం
- ఈ ఏడాది మార్చి నాటికి రూ.92,761 కోట్ల ఖర్చు
న్యూఢిల్లీ, నవంబర్ 19 : అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ రైలు కారిడార్‌పై 2026 మార్చి నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) రూ.92,761 కోట్లు ఖర్చు చేసింది. డెక్కన్ హెరాల్డ్ ప్రతినిధి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత నిర్ణయించిన రూ.1,08,000 కోట్ల నుంచి దాదాపు రెట్టింపునకు చేరి రూ.2,02,797 కోట్లుగా మారింది మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ మీదుగా సాగే 508 కి.మీ. మార్గం గల ఈ ప్రాజెక్టు పలు కారణాలతో ఆలస్యమైంది.
2023లో పూర్తికావాల్సిన ప్రాజెక్టు గడువు దాటిపోయింది. ప్రాజెక్టు పూర్తయ్యే తాత్కాలిక గడువును ‘అన్ని కాంట్రాక్ట్ ప్యాకేజీలను కేటాయించిన తర్వాతే నిర్ణయించవచ్చు’ అని ఆర్టీఐ సమాధానంలో పేర్కొన్నారు. జపాన్ ట్రాక్ సాంకేతికత, జపాన్యేతర సిగ్నలింగ్ వ్యవస్థ, భారత్‌లో తయారైన రైళ్ల కలయిక అసలు రూపకల్పనలో భాగమేనా అన్న ప్రశ్నకు ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ సమాధానమిస్తూ జపాన్ షింకాన్సెన్ రోలింగ్ స్టాక్‌తో, అంటే రైలు బోగీలు-ఇంజిన్ల సముదాయంతో సేవలు ప్రారంభించాలని భావించినప్పటికీ, ఇప్పుడు ‘స్వదేశంలో అభివృద్ధి చేసిన రైలు సెట్‌ను’ వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

