Chaithu Jonnalagadda | బబుల్ గమ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిశాడు సిద్దు జొన్నల గడ్డ సోదరుడు చైతు సిద్దు జొన్నల గడ్డ (Chaithu Jonnalagadda). చైతూ రైటర్‌గా ధార్కారి #MM పార్ట్ 2ను ప్రకటించగా.. ఇప్పటికే డిజైన్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ మసాలా సినిమా అని ప్రీ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
చైతూ జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా టైటిల్ లుక్ ను న్యాచురల్ స్టార్ నాని లాంచ్ చేశాడు. ఈ చిత్రానికి Moses Manikchand (పార్టు 2) టైటిల్ ఖరారు చేశారు. రియల్ విలన్ ఫేక్ హీరో కంటే బెటర్. టౌన్లో కొత్త డాన్ మోసెస్ మానిక్చంద్ను మీట్ అవ్వండి.. అంటూ సోఫాలో కూర్చున్న చైతూ మెడ నిండా బంగారు ఆభరణాలు, స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.
ఈ చిత్రానికి చైతూ జొన్నలగడ్డ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. చైతూ జొన్నలగడ్డ నాని నటిస్తోన్న హిట్ 3లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి చైతూ ఓ వైపు యాక్టర్‌గా, మరోవైపు రైటర్ తనను తాను నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నాడని అర్థమవుతోంది.
A 𝐑𝐄𝐀𝐋 𝐕𝐈𝐋𝐋𝐀𝐈𝐍 is better than a 𝐅𝐀𝐊𝐄 𝐇𝐄𝐑𝐎 😎🔥
Meet the all-new DON in town – #MosesManikchand ❤️🔥❤️🔥#HappyBirthdayChaituJonnalagadda 🥳#ChaituJonnalgadda GIN & ASS #MosesManikchand in Part -2 #MM2 @vishwaprasadtg @peoplemediafcy #ChaituJonnalagadda… pic.twitter.com/Vnm1BW3gXv
— BA Raju’s Team (@baraju_SuperHit) November 14, 2024
Varun Tej | వరుణ్ తేజ్‌కు ఓజీ డైరెక్టర్ సుజిత్ కథ చెప్పాడట.. కానీ
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట