Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం కన్నప్ప (Kannappa). బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలోని పలు పాత్రలను పరిచయం చేసిన డైరెక్టర్ తాజాగా మోహన్ బాబు లుక్ షేర్ చేశాడు. ఇందులో మహదేవ్ శాస్త్రిగా కనిపించనున్నట్టు తెలియజేస్తూ ప్రీ లుక్ విడుదల చేశారు.
ఫుల్ లుక్‌ను నవంబర్ 22న లాంచ్ చేయనున్నట్టు తెలియజేశారు. ఇందులో మోహన్ బాబు పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతున్నట్టు ప్రీ లుక్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుంచి లాంచ్ చేసిన టీజర్, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఇక కన్నప్ప నుంచి తిన్నడు, ముండడు, చండుడు, మారెమ్మ, పిలక-గిలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేయగా.. స్టిల్స్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్‌కుమార్ శివుడిగా కనిపించబోతున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మంచు విష్ణు తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Capturing devotion and grandeur. Presenting the Majestic pre-look of @themohanbabu garu as ‘Mahadeva Shastri’ from #Kannappa🏹. Stay tuned as the full look unveils on the 22nd of November!🌟✨ #HarHarMahadevॐ#MohanBabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/94rde0PQCk
— BA Raju’s Team (@baraju_SuperHit) November 18, 2024
Pushpa 2 The Rule trailer | ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది
Akira Nandan | ఓజీతోనే అకీరానందన్ ఎంట్రీ.. ఎస్ థమన్ క్లారిటీ ఇచ్చేసినట్టే..!
Diljit Dosanjh | వాళ్లు ఏం చేసినా అనుమతిస్తారు.. వివాదంపై దిల్జీజ్ దోసాంజ్