Diljit Dosanjh | ప్రముఖ నటుడు, పంజాబీ సింగ్ దిల్జీజ్ దోసాంజ్ (Diljit Dosanjh)కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో శనివారం జరగబోయే దిల్ లుమినాటి కన్సర్ట్కు ముందు అధికారులు నోటీసులు పంపారు. మద్యం, డ్రగ్స్ లేదా హింసను ప్రోత్సహించడం పాటలు పాడొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దిల్జీజ్ దోసాంజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆర్టిస్టులు ఇతర దేశాల నుంచి భారత్‌కు వస్తే.. వాళ్లు ఏం చేసినా.. ఏం పాడినా అనుమతిస్తారు. ఎలాంటి టెన్షన్ ఉండదు. కానీ ఓ ఆర్టిస్టు మీ సొంత దేశం నుంచి పాడేందుకు వస్తే మాత్రం జనాలకు చాలా ఇబ్బందులు వస్తాయంటూ చురకలంటించాడు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
చంఢీగడ్‌కు చెందిన ఓ వ్యక్తి దిల్జీత్ దోసాంజ్ గతంలో డ్రగ్స్, మద్యంపై పాడిన పాటల వీడియోను సాక్షాలుగా చూపించి ఫిర్యాదు చేయడంతో మేరకు ప్రభుత్వం దిల్జీత్‌కు నోటీసులు పంపింది. దిల్జీత్ దోసాంజ్ దిల్ లుమినాటి టూర్ దేశవ్యాప్తంగా 11 నగరాల్లో గత నెల 26న మొదలు కాగా.. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కూడా కన్సర్ట్ నిర్వహించారు.
#Watch: Punjabi singer #DiljitDosanjh reacted to the controversy surrounding the #Telangana government’s ban on some of his songs during his #Hyderabad concert on Saturday night.
Diljit said, “When artists come to India from other countries, they are allowed to do whatever they… pic.twitter.com/tdvC0LpqMW
— Mirror Now (@MirrorNow) November 17, 2024
The Rana Daggubati Show | నాకు ఏం తెలియదు.. ది రానా దగ్గుబాటి షో ట్రైలర్ వచ్చేసింది
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Varun Tej | వరుణ్ తేజ్‌కు ఓజీ డైరెక్టర్ సుజిత్ కథ చెప్పాడట.. కానీ