జడ్చర్ల టౌన్, మార్చి 10: విదేశీ టకీలా కంటే ఇప్పపూల సారానే బెస్ట్ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ.. రసాయనాలు ఉపయోగించి తయారు చేసే కల్తీ సారా గురించి తాను మాట్లాడటం లేదని, అడవుల్లో సహజ సిద్ధంగా దొరికే ఇప్పపూలతో తయారు చేసే సారాను ప్రమోట్ చేయాలని మాత్రమే కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఇప్ప సారా అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, కేవలం గిరిజనుల కోసమే ఈ విషయమై అసెంబ్లీలో మాట్లాడనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పసారాను తీసుకొస్తే రాష్ర్టానికి రూ.లక్ష కోట్లు ఆదాయం రావటమే గాకుండా గిరిజనులకు సైతం ఏటా రూ.లక్షల ఆదాయం సమకూరుతుందని అభిప్రాయపడ్డారు.