హైదరాబాద్, ఆట ప్రతినిధి : నగరంలోని గచ్చిబౌలిలో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు బుధవారం మరో కీలక మ్యాచ్ ఆడనున్నది. పూల్-బీలో భాగంగా భారత అమ్మాయిలు.. నేడు వేల్స్‌తో తలపడనున్నారు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి ఒకదాన్ని డ్రా చేసుకున్న భారత్.. ప్రత్యర్థిని నిలువరించి డ్రా చేసుకున్నా సెమీస్ బెర్త్ ఖాయమవనుంది.
పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం భారత్, స్కాట్లాం డ్ తలా 4 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ గోల్స్ ఎక్కువుండటంతో ఆతిథ్య జట్టు అగ్రస్థానంలో ఉంది. ఒకవేళ మ్యాచ్ ఓడితే మాత్రం స్కాట్లాండ్, ఉరుగ్వే మ్యాచ్ ఫలితంతో భారత భవితవ్యం తేలనుంది. కాగా ఈ టోర్నీలో వేల్స్‌పై భారత్‌కు 5-1తో తిరుగులేని ఆధిపత్యం ఉంది