Dattagiri Ashram | ఝరాసంగం: అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే దైవస్వరూపమే గురువు. జీవితానికి దిశానిర్దేశం చేస్తూ ధర్మమార్గంలో నడిపించే వారే గురువులు అని బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహరాజ్, మహామండలేశ్వర్ డా. సిద్ధేశ్వరానంద గిరి మహరాజ్ తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం గోపూజ, వేద విద్యార్థులతో (Veda Student) తల్లిదండ్రులకు పాదపూజ, గురు చరిత పారాయణం, రుద్ర సహిత దత్త యజ్ఞం, అవధూత గిరి మహరాజ్ రథోత్సవం, రుద్రాక్ష మాలలతో తులాభారాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Radhotsavam
కేంద్ర మాజీ మంత్రి భగవంత్ ఖూబా, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ జడ్పీ చైర్పర్సన్ సునీత హనుమంతరావుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గురుపాద పూజలో పాల్గొని గురువులను సన్మానించారు. తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు కూడా గురుపాద పూజలకు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం, బర్దీపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.