Pushpa 2 The Rule trailer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పాట్నాలోని గాంధీ మైదాన్ పుష్ప ది రూల్ ట్రైలర్ లాంచ్ చేశారు.
ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు.. అంటూ జగపతి బాబు వాయిస్ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్. పుష్ప.. పేరు చిన్నది.. కానీ సౌండ్ మాత్రం చాలా పెద్దది.. పుష్ప అంటే పేరు కారు.. బ్రాండ్.. అంటూ సాగుతున్న సంభాషణలు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్.. పార్టీ ఉంది పుష్ప అంటూ ఫస్ట్ పార్టును మించిపోయే డైలాగ్స్‌తో సాగుతున్న ట్రైలర్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ రికార్డుల మోత మోగించడం ఖాయమని చెప్పకనే చెబుతోంది.
శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తానంటున్నారు పుష్పరాజ్. ఇక ఫస్ట్ పార్టులో పార్టీ లేదా పుష్ప అని అడిగిన భన్వర్ సింగ్ షెకావత్.. ఈ సారి మాత్రం పార్టీ ఉంది పుష్ప అంటూ హైప్ పెంచేస్తున్నాడు. పుష్ప ది రైజ్‌లో ఇండియా వరకే పరిమితమైన ఎర్రచందనం బిజినెస్.. సీక్వెల్లో ఖండాంతరాలు దాటినట్టు ట్రైలర్ చెబుతోంది.
పుష్ప 2 ది రూల్‌లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా పనిచేస్తు్ండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పుష్ప 2 ది రూల్ ట్రైలర్..
Diljit Dosanjh | వాళ్లు ఏం చేసినా అనుమతిస్తారు.. వివాదంపై దిల్జీజ్ దోసాంజ్
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్